కాగజ్‌నగర్‌లో ఆవుల దొంగకు దేహశుద్ధి

by Taduka Kalyani |

కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీ నగర్‌లో గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కొన్ని పదుల సంఖ్యలో ఆవుల దొంగతనాల మిస్టరీ ఎట్టకేలకు వీడింది.

కాగజ్‌నగర్‌లో ఆవుల దొంగకు దేహశుద్ధి
X

దిశ,కాగజ్‌నగర్: కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీ నగర్‌లో గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కొన్ని పదుల సంఖ్యలో ఆవుల దొంగతనాల మిస్టరీ ఎట్టకేలకు వీడింది. పక్కా ప్లాన్‌తో దొంగను పట్టుకున్న కాలనీ వాసులు, అతనికి గట్టిగానే బుద్ధి చెప్పారు. బాలాజీ నగర్ కాలనీలో గత కొంతకాలంగా వరుసగా ఆవులు మాయమవుతున్నాయి. దీనిపై నిఘా పెట్టిన కాలనీ వాసులు, బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజు అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారించగా, అతను పెట్రోల్ పంప్ ఏరియాకు చెందిన మరో వ్యక్తితో కలిసి ఆవులను దొంగిలించి, గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నట్లు ఒప్పుకోవడంతో దొంగ దొరికిన వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, ఇర్ఫాన్ నగర్ కి చెందిన రాజు అనే వ్యక్తిని మా కళ్ళముందే ఆవులను ఎత్తుకెళ్తారా అంటూ కాలనీ వాసులు ఆగ్రహంతో ఊగిపోయి దేహశుద్ధి చేశారు. మళ్ళీ ఇలాంటి పనులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని దొంగకు గట్టిగా హెచ్చరించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Next Story