- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాగజ్నగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు..
by Batti.Sumithra |
కాగజ్ నగర్ పట్టణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

X
దిశ, కాగజ్ నగర్ : కాగజ్ నగర్ పట్టణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ స్కూల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప 94 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అతనితో పాటు, కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ, కుటుంబసభ్యులు గురువారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగజ్నగర్ పట్టణంలోని శిశుమందిర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్, ఆయన సతీమణి రావి సునీత ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Next Story






