- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించండి..
by Batti.Sumithra |
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలంటూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు.

X
దిశ, సోన్ : పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలంటూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రు. 50 పెంచడాన్ని నిరసిస్తూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు మేరకు సోన్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్దం చేశారు.
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్, మొయినుద్దీన్, జెడ్పీటీసీ జీవన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వినోద్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి, జక్క రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






