- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పగిలిన ఆసుపత్రి కిటికీ అద్దాలు.. ప్రహరీ లేక అవస్థలు!
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు. ఏల్లకాలంగా ఆక్రమించుకొని ఉన్న దుకాణాల సముదాయాలు ఇటీవల తొలగించబడ్డాయి.

దిశ, కుబీర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు. ఏల్లకాలంగా ఆక్రమించుకొని ఉన్న దుకాణాల సముదాయాలు ఇటీవల తొలగించబడ్డాయి. హాస్పిటల్ పరిసరాల్లోకి పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎటునుంచైనా వెళ్లి రావచ్చు. ఆసుపత్రికి కిటికీలకు ఏర్పాటు చేసిన అద్దాలు పగలకపోతే ఒట్టు అన్నట్లుగా మారింది పరిస్థితి. పోకిరిలా చేష్టాలకు ఆ రూమ్ చుట్టూ ఉన్న కిటికీల అద్దాలు పగిలి దర్శనమిస్తున్నాయి. పక్షులు చొరబడి రెట్టలతో దుర్గంధం చేస్తున్నాయి. పగిలిన అద్దాల నుంచి పోకిరిలు బండరాళ్లతో లోపలికి కొట్టిన విలువైన పరికరాలు ఇతర వస్తువులు పనికి రాకుండా పోతాయని పలువురు అంటున్నారు.
పనిచేసే సిబ్బంది సమయం ముగిసిన తర్వాత ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోయింది. పక్కనే మిషన్ భగీరథ ట్యాంక్ ఉంది. ఈ లీకేజీ నీళ్లు డ్రైనేజికి వెళ్లేలా కలపకుండా, హాస్పిటల్ సెప్టిక్ ట్యాంకులోకి వెళ్లేలా కలిపేశారు. దీంతో ఆస్పత్రిలోని బాత్రూంలకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అక్రమాల నుంచి తొలగించిన ప్లేస్ లో చొరవ తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే ఆదాయం గణనీయంగా వస్తుంది. సంబంధిత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని, ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని మండల వాసులు వాపోతున్నారు.






