- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుర ‘పోరు’కు నేటితో బ్రేక్.. మద్యం, మనీ పంపిణీకి ప్లాన్
పురపాలక సంఘాల ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనుంది.

దిశ, నిర్మల్ ప్రతినిధి: పురపాలక సంఘాల ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. బుధవారం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించే ప్లాన్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ప్రచారాన్ని సాగిస్తుండగా ఇక్కడ తీసిపోకుండా భారత్ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీలు పోటీపడి ప్రచారం సాగించాయి కాగా ఈరోజు సాయంత్రంతో పార్టీల ప్రచారం ముగియనుంది
మనీ, మద్యంపై పార్టీల దృష్టి...
ప్రచారం ముగిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు డబ్బు పంపిణీ మద్యం పంపిణీ పై దృష్టి పెడుతున్నాయి ఇప్పటికే చైర్మన్ పదవి ఆశిస్తున్న అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీల ద్వారా తమ కౌన్సిలర్ అభ్యర్థులకు చేరవేసినట్లు కూడా ప్రచారం జరుగుతున్నది సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి దాకా డబ్బులు పంపిణీ మద్యం పంపిణీ పై ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నట్లు తెలుస్తున్నది ఉదాహరణకు నిర్మల్ పురపాలక సంఘంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఓటుకు వెయ్యి నుంచి 2000 ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది ఒక్కో కౌన్సిలర్ అభ్యర్థికి పార్టీ ద్వారా అభ్యర్థుల ఆర్థిక పరిస్థితులను బట్టి ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా రహస్యంగా అందజేసి ఆ డబ్బులను తమ అనుచరుల కనుసన్నల్లో ఓటర్లకు అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
కీలక నేతలు చివరి రోజుదాకా...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు ఎన్నికల క్షేత్రంలోనే ఉండి ప్రచారం చేస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు క్యాతంపల్లి పురపాలక సంఘాల్లో తీవ్రంగా ప్రచారం చేశారు ఆయన తనయుడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి నిర్మల్ పూరపాలక సంఘంలో ఇక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి లు బిజెపి తరఫున మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశారు.






