నిర్మల్‌లో బాలుడి మిస్సింగ్

by Ajay Maddhiboyina |

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని భాగ్య‌న‌గ‌ర్ కాల‌నీలో బాలుడు మిస్సింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాల‌నీకి చెందిన ప‌సుపులేటి అనిల్ చంద్రిక దంప‌తుల కుమారుడు అశ్విన్(3) అదృశ్య‌మ‌య్యాడు.

నిర్మల్‌లో బాలుడి మిస్సింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని భాగ్య‌న‌గ‌ర్ కాల‌నీలో బాలుడు మిస్సింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాల‌నీకి చెందిన ప‌సుపులేటి అనిల్ చంద్రిక దంప‌తుల కుమారుడు అశ్విన్(3) అదృశ్య‌మ‌య్యాడు. శ‌నివారం ఉద‌యం ఆరుబ‌య‌ట ఆడుకుంటున్న అశ్విన్ అదృశ్యం అవ్వ‌గా చుట్టుప‌క్క‌ల వెతికిన‌ప్ప‌టికీ ఆచూకీ ల‌భించ‌లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిసినట్లయితే 9014881118 నంబ‌ర్ కు ఫోన్ చేయ‌గ‌లరు.

Next Story