బాలుడి పై వీధి కుక్కల దాడి

by Ratna Kumari |

వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంచిర్యాల జిల్లా లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బాలుడి పై వీధి కుక్కల దాడి
X

దిశ, మంచిర్యాల : వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన మంచిర్యాల జిల్లా లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ నగర్ నాలుగో డివిజన్ లో ఎన్నం సతీష్ కుమారుడు హర్షవర్ధన్ ఇంటి బయట ఆడుకుంటుండగా సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన కుటుంబ సభ్యులు కుక్కలను తరమానడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. వెంటనే బాలుడిని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాబుకు ప్రమాదం తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయని దారి వెంట నడిచి వెళ్లే బాటసారులపై వెంబడిస్తున్నాయన్నారు. అధికారులకు విన్నవించిన సంబంధిత అధికారులు పట్టించుకోలేదన్నారు. వీధి కుక్కల బెడద అధికంగా ఉందని బయటికి వెళ్లాలంటే ప్రాణాలను భయం గుప్పెట్లో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోయారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Next Story