అన్నం లో పురుగులు.. విద్యార్థి ఆవేదనకు బదులుగా బెదిరింపు!

by Bhanu |

మండల కేంద్రంలోని ఎస్‌టీ హాస్టల్‌లో విద్యార్థులకు ఇవ్వబడుతున్న భోజనం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నం లో పురుగులు.. విద్యార్థి ఆవేదనకు బదులుగా బెదిరింపు!
X

దిశ, బోథ్ : మండల కేంద్రంలోని ఎస్‌టీ హాస్టల్‌లో విద్యార్థులకు ఇవ్వబడుతున్న భోజనం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హాస్టల్‌లో అందించిన అన్నంలో పురుగులు రావడం, నీళ్ల పప్పు పెట్టడం వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిస్థితిపై ఓ విద్యార్థి హాస్టల్ ఇన్చార్జిని ప్రశ్నించగా, సమస్యను పరిష్కరించాల్సిన అధికారి విద్యార్థిని టీసీ ఇస్తానని బెదిరించడమే కాక, విమర్శలపాలయ్యాడు.

పిల్లల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఈ పరిస్థితిపై విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు మున్సిఫ్, హాస్టల్‌లో భోజన నాణ్యతపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని బెదిరించిన హాస్టల్ ఇన్చార్జిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నప్పటికీ, హాస్టల్‌లో కనీస మెడిసిన్ సౌకర్యం లేకపోవడం బాధాకరమన్నారు. సంబంధిత అధికారులు వారం రోజులలో చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్‌ను, ఉన్నతాధికారులను కలిసి మరింత తీవ్రంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Next Story