ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన బోథ్ ఎమ్మెల్యే

by Jakkula.Mamatha |   (  Updated:2026-04-13 09:21:51  IST  )

మండల కేంద్రంలో గల 70 సంవత్సరాల పురాతనమైన మార్కండేయ నూతన ఆలయ నిర్మాణానికి సోమవారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై భూమి పూజ చేశారు.

ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన బోథ్ ఎమ్మెల్యే
X

దిశ,బోథ్: మండల కేంద్రంలో గల 70 సంవత్సరాల పురాతనమైన మార్కండేయ నూతన ఆలయ నిర్మాణానికి సోమవారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం దేవుడు కల్పించిన వరమని మార్కండేయుడే తన గుడి నిర్మాణానికి నా ద్వారా మోక్షం కల్పించుకున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ ఎంపిపి తుల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, నారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేందర్ యాదవ్, మల్లేష్, ప్రశాంత్, రమణ గౌడ్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story