- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి
దిశ, బోథ్ : రోడ్డు ప్రమాదం ఇద్దరూ వ్యక్తులు మృతి చెందిన సంఘటన నేరేడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి

X
దిశ, బోథ్ : రోడ్డు ప్రమాదం ఇద్దరూ వ్యక్తులు మృతి చెందిన సంఘటన నేరేడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి నేరడిగొండ మండలం లోని ఆరెపల్లి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఎడమ టైర్ పగలడంతో లారీ రోడ్ పై ఆగిపోయింది. అదే సమయంలో ఓ ద్విచక్ర వాహనం ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొనడం తో ద్విచక్ర వాహనం నడుపుతున్న లింగట్ల గ్రామానికి చెందిన ఆత్రం ధర్ము అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న గణేష్ తీవ్రంగా గాయపడడం తో అతన్ని నిర్మల్ ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ గణేష్ మృతి చెందినట్లు ఎస్సై వెల్లడించారు.
Next Story






