- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశువుల పాకలో రక్త పింజర కలకలం..!
దిశ, బోథ్ : నియోజకవర్గ కేంధ్రానికి సమీపంలో ఉన్న పలువురి రైతుల పశువుల పాకలలో విషషర్పాలు బయట పడుతుండడం తో రైతులు భయాందోళన కు గురవుతున్నారు.

దిశ, బోథ్ : నియోజకవర్గ కేంధ్రానికి సమీపంలో ఉన్న పలువురి రైతుల పశువుల పాకలలో విషషర్పాలు బయట పడుతుండడం తో రైతులు భయాందోళన కు గురవుతున్నారు. బుధవారం ఓ రైతు వ్యవసాయ భూమిలోని పశువుల పాకలో దాదాపు ఆరు అడుగుల పొడవైన రక్త పింజర పాము కనపడడం తో భయాందోళనకు గురై వెంటనే చుట్టుపక్కల ఉన్న రైతులకు తెలుపడం తో వారు వచ్చి పాము ని వెతికారు.రక్త పింజర అక్కడ ఉన్నవారి మీదకు బుసలు కొడుతూ వస్తుండడం తో ప్రాణ భయం తో దానిని చంపివేశారు. అయితే కొన్ని రోజుల క్రితం కూడా అక్కడి వ్యవసాయ పొలం లోని ఓ రైతుకు చెందిన పశువుల పాక లో దాదాపు ఆరు అడుగుల నాగు పాము కనిపించడం తో ఇచ్చోడా మండలం నుండి పాములు పట్టే వారిని పిలిపించి దాదాపు రెండు గంటలు కష్టపడి పాము ని పట్టుకుని అడవిలో వదిలేసినట్లు రైతులు తెలిపారు.ఏది ఏమైనా పశువుల పాకలలో భయానక విష షర్పాలు బయటపడుతుండడంతో పశువుల పాకలోకి వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు.పలువురు మాట్లాడుతూ రైతులు పశువుల పాకలో ఉన్న గడ్డి కానీ ఇతర పనిముట్లు తీసేటప్పుడు అలికిడి చేస్తూ తీయాలని పలువురు హెచ్చరిస్తున్నారు.






