ఆదిలాబాద్ లో జాతీయ రహదారి దిగ్బంధం..అఖిల‌ప‌క్షం రైతులు ధ‌ర్నా

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆదిలాబాద్ : పంట కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బోరజ్ వద్ద జాతీయ రహదారిని రైతులు

ఆదిలాబాద్ లో జాతీయ రహదారి దిగ్బంధం..అఖిల‌ప‌క్షం రైతులు ధ‌ర్నా
X

దిశ, ఆదిలాబాద్ : పంట కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బోరజ్ వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. బీఆర్ఎస్ తో సహా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి జోగు రామన్న, అఖిలపక్ష, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులతో కలిసి నేతలు రోడ్డుపై రొట్టెలు తిని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చి నిరసనలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మాజీమంత్రి జోగురామన్న మాట్లాడుతూ.. సీసీఐ నిబంధనలు తొలగించాలని,7 క్వింటాళ్ల పత్తి పరిమితిని తీసివేయాలని డిమాండ్ చేశారు. కపస్ కిసాన్ యాప్ ను వెంటనే రద్దు చేయాలన్నారు.సీసీఐ నిబంధనల కారణంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నప్పటికీ..స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. నెల రోజుల పాటు రైతులకు ఇబ్బంది లేదని మాయమాటలు చెప్పిన స్థానిక ఎమ్మెల్యే.. రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతతో సీఎం రేవంత్ తో కలిసి ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలుస్తున్నారని, రైతులతో రాజకీయం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయకులు బండి దత్తాత్రి,దర్శనాల మల్లేష్,విజ్జగిరి నారాయణ,చారులత రాథోడ్,యూనిస్ అక్బానీ పాల్గొన్నారు.

Next Story