మధుకర్ ఆత్మహత్య కేసులో దోషులను శిక్షించాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

by Ratna Kumari |

దిశ, వేమనపల్లి : వేమ‌న‌ప‌ల్లి బీజేపీ మండ‌ల అధ్య‌క్షుడు ఏటా మ‌ధుక‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో దోషుల‌ను శిక్షించాల‌ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు పేర్కొన్నారు.

మధుకర్ ఆత్మహత్య కేసులో దోషులను శిక్షించాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
X

దిశ, వేమనపల్లి : వేమ‌న‌ప‌ల్లి బీజేపీ మండ‌ల అధ్య‌క్షుడు ఏటా మ‌ధుక‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో దోషుల‌ను శిక్షించాల‌ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం మ‌ధుక‌ర్ స్వ‌గ్రామం నీల్వాయిలో ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. మ‌ధుక‌ర్ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. మ‌ధుక‌ర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా బీజేపీ ఆదుకుంటుందని, మధుకర్ ఆత్మహత్య కేసులో దోషులను శిక్షించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీలో కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉన్నప్పటికీ పోలీసులు ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్ర‌శ్నించారు. ఇవాళ‌ రామగుండం పోలీస్ కమిషనర్ ను కలిసి కేసు పురోగతిపై చర్చించ‌నున్న‌ట్టు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు ఎవ్వ‌రూ మనోధైర్యం కోల్పోవద్దని, మీకు అన్ని విధాలుగా పార్టీ ఆదుకుంటుందని తెలిపారు. ఇక జ‌డ్పీటీసీ ఎన్నికల్లో మధుకర్ పోటీ చేసి ఎక్కడ గెలుస్తాడో అని కాంగ్రెస్ నాయకులు అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి ఆత్మహత్య చేసుకునేలా రాజకీయ వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల హేమాజీ, బీజేపీ నాయకులు దుర్గం అశోక్, గోమాస శ్రీనివాస్,వేమనపల్లి మండల బిజెపి నాయకులు కంపల్లి అజయ్ కుమార్, కొప్పుల చరణ్ రాజ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Next Story