- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందమర్రిలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
by S Gopi |
మందమర్రిలో బీజేపీ నాయకులను బుధవారం ముందస్తు అరెస్టులు చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో... BJP Leaders arrest

X
దిశ, మందమర్రి: మందమర్రిలో బీజేపీ నాయకులను బుధవారం ముందస్తు అరెస్టులు చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఆర్థిక, ఆరోగ్య శాఖ తన్నీరు మంత్రి హరీష్ రావు విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వాన్ని కొనసాగించారు. అరెస్ట్ అయిన వారిలో ఆ పార్టీ మందమర్రి మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్, పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్, గడ్డం శ్రీనివాస్, ఎండీ మతిన్, వేల్పుల కిరణ్ లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు చేయడం వల్ల కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ అని విమర్శించారు. గారడి మాటలతో కేసీఆర్ రాష్ట్ర పగ్గాలు చేపట్టారని పేర్కొన్నారు.
Next Story






