ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి : బీజేపీ నాయకుల డిమాండ్

by Disha Web Desk 20 |
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి : బీజేపీ నాయకుల డిమాండ్
X

దిశ, ఇచ్చోడ : టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ను వెంటనే భర్తరఫ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను నీరు గార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం లీకేజీలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.

పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారాన్ని రాష్ట్రప్రభుత్వం అందించాలని పేర్కొన్నారు. లీకేజీ వ్యవహారంలో ఉన్న దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నేడు ఇచ్చోడ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకోను చేపడుతున్నామని చెప్పారు. నియోజక వర్గంలోని బీజేపీ ప్రజాప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాఉపాధ్యక్షులు మాధవరావ్, గుమ్మడి భీమ్ రెడ్డి, బోథ్ నియోజక వర్గం కన్వీనర్ సూర్యకాంత్ గెత్తే, బీజేవైఎం జిల్లా కార్యదర్శి చంద్ర శేఖర్, నాయకులు పెరుమాండ్ల పోశెట్టి, రమేశ్, జాధవ్ రాము, తదితరులు ఉన్నారు.



Next Story