- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు మద్దతుగా వ్యాపార సంస్థలు బంద్
దిశ, బోథ్ : సోనాల మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా గురువారం వ్యాపార సంస్థ యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ సోనాల బంద్ పిలుపు

దిశ, బోథ్ : సోనాల మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా గురువారం వ్యాపార సంస్థ యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ సోనాల బంద్ పిలుపు ఇవ్వగానే సంపూర్ణ బంద్ పాటించిన వ్యాపార యజమానులకు, ఆటో కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. బోథ్ , సోనాల రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా మీ వెంటే ఉంటామని ఎవరు అధైర్య పడవద్దని, రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులపై, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ప్రేమ ఉంటే సోనాల మండల కేంద్రంలో వెంటనే సోయా మరియు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, రైతులపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సోనాల బంద్ నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.






