సోనాల మండ‌లంలో పెద్ద‌పులి క‌ల‌క‌లం..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా సోనాల మండ‌లంలోని చింత‌ల‌బోరీ ప్రాజెక్ట్ స‌మీపంలో గురువారం పెద్ద‌పులిని చూసిన‌ట్టు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గురువారం అక్కడికి వెళ్లి

సోనాల మండ‌లంలో పెద్ద‌పులి క‌ల‌క‌లం..!
X

దిశ‌, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా సోనాల మండ‌లంలోని చింత‌ల‌బోరీ ప్రాజెక్ట్ స‌మీపంలో గురువారం పెద్ద‌పులిని చూసిన‌ట్టు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గురువారం అక్కడికి వెళ్లి పెద్ద పులి సంచరిస్తున్నదని నిర్ధారించారు. ఈ సందర్బంగా ఎఫ్ఆర్ఓ ప్రణయ్ మాట్లాడుతూ బోథ్ అటవీ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తున్నదని మారుమూల గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అన్నారు. అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది కావున పశువుల కాపరులు, ఇతరులు ఎవరు కూడా అటవీ ప్రాంతాలకు వెళ్ళవద్దన్నారు. ప్రస్తుతం పత్తి సీజన్ కావడం తో వ్యవసాయ కూలీలు పత్తిని తీసేందుకు వెళ్తార‌ని, అలాంటి వాళ్ళు ముఖానికి వెనుక భాగం లో బెదురు మాస్క్ లు ధరించాలని, ఉదయం పూట వెళ్లి సాయంత్రానికి ముందు ఇంటికి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. అటవీ ప్రాంతంలో ఉన్న సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లొద్ద‌ని వ్యవసాయ పనులకు వెళ్లేవారు గుంపులు గుంపులుగా కలిసి వెళ్లాలని సూచించారు. అలాగే ఎవరైనా జంతువుల కోసం విద్యుత్ గాని, విష ప్రయోగం చేసిన వారి పట్ల కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని హెచ్చరించారు. స్థానికులు, రైతులు మాట్లాడుతూ పంట చేతికి వ‌స్తున్న త‌రుణంలో మ‌ళ్లీ పులి సంచ‌రిస్తుండ‌టంతో అట‌వీ స‌మీపంలో ఉన్న వ్య‌వ‌సాయ పొలాల వ‌ద్ద‌కు వెళ్లాలంటేనే భ‌యంగా ఉంద‌న్నారు. ప‌త్తి తీయ‌డానికి కూలీలు కూడా వెనుక‌డుగు వేసే అవ‌కాశ‌ముంద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story