Payal Shankar Car Accident : ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు తప్పిన పెను ప్రమాదం

by Muthe.Rajitha |   (  Updated:2024-10-25 17:07:29  IST  )

ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.

Payal Shankar Car Accident : ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. కామారెడ్డి జిల్లా పోలీసుల వివరణ ప్రకారం.. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు వెళ్తున్న పాయల్ శంకర్ కారును, వెనుక నుండి వచ్చిన ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ధ్వంసం కాగా.. పాయల్ శంకర్ చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే వేరే కారులో ఆదిలాబాద్ కు పయనమయ్యారు. కాగా ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ మీద కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందేమో అని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు.

Next Story