సమయానికి రారు.. అందుబాటులో ఉండరు..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-04-09 12:27:42  IST  )

రైతులకు అందుబాటులో ఉండాల్సిన‌ వ్యవసాయ అధికారిణి ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

సమయానికి రారు.. అందుబాటులో ఉండరు..!
X

దిశ, భీమిని : రైతులకు అందుబాటులో ఉండాల్సిన‌ వ్యవసాయ అధికారిణి ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా భీమిని మండలం లో విధులు నిర్వర్తించే మండల వ్యవసాయ అధికారిని యమున దుర్గ గురువారం మధ్యాహ్నం 12 గంటలకే ఇంటి ముఖం పట్టింది. వ్యవసాయ కార్యాలయానికి వెళ్లి చూడగా కార్యాలయం డోర్లు తెరుచుకొని ఉన్నాయి. కార్యాలయంలో ఖాళీ కుర్చి దర్శనమిచ్చింది. దీంతో వ్యవసాయ అధికారినికి ఫోన్ లో వివరణ కోరగా.. తాను ఫీల్డ్ విజిట్ చేయడానికి విగాం గ్రామానికి వెళ్లడం జరిగిందని సమాధానం ఇచ్చారు. ఇంటెన్షన్ లో మాట్లాడాను. మీకు ఏదైనా పని ఉందా చేస్తాను. మీరు ఏమైనా ఆశిస్తున్నారా అంటూ ఫోన్ కట్ చేశారు. ప్రతిరోజు సమయపాలన పాటించాల్సిన అధికారిని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఉదయం 11 గంటలకు వచ్చి మధ్యాహ్నమే ఇంటికి వెళుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల పై రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ అధికారిని విధులను విస్మరించడం ఏంటని మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారినితోపాటు తన భర్త తన వెంట ఉంటూ అన్ని పనులను తానే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మండలంలో ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లో వారానికి రెండుసార్లు చేయాల్సిన తనిఖీని భర్త దగ్గర ఉండి షాపుల్లో విజిట్ చేస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి.

రైతుల‌కు అవ‌గాహ‌న క‌రువు..

మండలంలో మూడు క్లస్టర్లు ఉండగా.. ఏ ఒక్క క్లస్టర్ లో కూడా వ్యవసాయ అధికారిని అవగాహన నిర్వహించకపోవడంపై రైతులు వాపోతున్నారు. పట్టణాల నుంచి విధులను నిర్వర్తిస్తూ వెళ్లడం అధికారానికి మామూలుగా మారిందని రైతులు అంటున్నారు.

నకిలీ విత్తనాలపై నిఘా నిద్దరోయి

మంచిర్యాల జిల్లాలోనే భీమిని మండలం లో ప్రభుత్వ నిషేధిత గ్లైపోసిట్ నకిలీ పత్తి విత్తనాలను అక్రమ దారుల్లో తీసుకువచ్చి కొందరు దళారులు అమాయకపు రైతులకు విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా ఈ మండలంలో నకిలీ పత్తి విత్తనాలను గడ్డి కలుపు నివారణ కోసం గ్లైపోసిట్ నకిలీ విత్తనాల వైపు మొగ్గు చూపుతున్నట్లు స‌మాచారం. నకిలీ విత్తనాలను పంటలు సాగు చేసిన రైతులు నష్టాల పాలవుతున్నారని తెలుస్తోంది. జిల్లా స్థాయి అధికారులు ఈ నకిలీ పత్తి విత్తనాల భారీ నుంచి విముక్తి కల్పించేందుకు రైతులకు అవగాహన కల్పించాలనే జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ.. భీమిని వ్యవసాయ అధికారినికి మాత్రం పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వ్యవసాయ అధికారిని తీరు పై మండల రైతులు మండిపడుతున్నారు.

తీరు మార్చుకోకపోతే చర్యలు

మంచిర్యాల జిల్లా ఇన్ చార్జి వ్యవసాయ అధికారిని సురేఖను ఫోన్ లో సంప్రదించగా.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. మండల వ్యవసాయ అధికారినితో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటానని సమాధానం ఇచ్చారు.

Next Story