నిర్మల్ నూతన కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా

by Batti.Sumithra |

నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా ఆదివారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు.

నిర్మల్ నూతన కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా ఆదివారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు చేరుకున్న నూతన కలెక్టర్‌కు పూర్వపు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్‌లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు జీవరత్నం, డా. రాజేందర్, శ్రీనివాస్, నరసింహ రెడ్డి, దయానంద్, భోజన్న, సుధాకర్, విజయలక్ష్మి, రమణ, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story