పోలీసుల స్పెషల్ డ్రైవ్.. పట్టుబడ్డ ద్వి చక్ర వాహనాలు...

by Bhanu |

జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పట్టణ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ గోపీనాథ్ సిబ్బందితో కలిసి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

పోలీసుల స్పెషల్ డ్రైవ్.. పట్టుబడ్డ ద్వి చక్ర వాహనాలు...
X

దిశ, భైంసా : పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ చౌరస్తా వద్ద జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పట్టణ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ గోపీనాథ్ సిబ్బందితో కలిసి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడిపే పలువురు మైనర్ పిల్లల బండ్లను అలాగే సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ప్రతి ఒక్కరూ వాహనాలకు నంబర్ ప్లేట్లు కనిపించే విధంగా పెట్టుకోవాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకోవాలని లేని యెడల చట్టపర చర్యలకు బాధ్యులవుతారన్ని సీఐ సూచించారు.


Next Story