- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BEJJUR PACS : బెజ్జూర్ పీఏసీఎస్ లో ముగ్గురు సస్పెన్షన్
by Sridhar Babu |
బెజ్జూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో (BEJJUR PACS)జరిగిన అవినీతి అక్రమాలపై ఆ శాఖలో పనిచేస్తున్న కార్యదర్శులు జక్కుల వెంకటేశ్వర్ గౌడ్, పర్శ సంజీవ్ తో పాటు డేటా ఆపరేటర్ మహేష్ లను సస్పెండ్ (Suspend)చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా సహకార అధికారి బిక్కు రాథోడ్ పేర్కొన్నారు.

X
దిశ, బెజ్జూర్ : బెజ్జూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో (BEJJUR PACS)జరిగిన అవినీతి అక్రమాలపై ఆ శాఖలో పనిచేస్తున్న కార్యదర్శులు జక్కుల వెంకటేశ్వర్ గౌడ్, పర్శ సంజీవ్ తో పాటు డేటా ఆపరేటర్ మహేష్ లను సస్పెండ్ (Suspend)చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా సహకార అధికారి బిక్కు రాథోడ్ పేర్కొన్నారు.
బెజ్జూరు సహకార సంఘంలో సుమారు రూ.నాలుగు కోట్ల అవినీతిపై లెక్క తేలకపోవడంతో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై సహకార అధికారిని సంప్రదించగా జీఓ 44 ప్రకారం సొసైటీలో విధులు నిర్వహించే ముగ్గురు ఉద్యోగులను సస్పెన్షన్ చేయాలని సొసైటీ తీర్మానం చేయాల్సి ఉంటుందని, దీంట్లో భాగంగానే సహకార సంఘానికి ఉత్తర్వులు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.
Next Story






