- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు స్నేహితుల మధ్య బీర్ల గొడవ.. పురుగుల మందు తాగి యువకుడు మృతి
మనస్తాపానికి గురైన 22 ఏళ్ల యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, మామడ: మండలంలోని తాండ్ర గ్రామానికి చెందిన షేక్ జుబేర్ (22) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై హనుమండ్లు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం మద్యం బాటిళ్లను జుబేర్ తీసుకొని వెళ్తుండగా, రోడ్డు పక్కనే కూర్చున్న అతని స్నేహితుడు కుడికాల పోశెట్టి నాకు బీరు బాటిల్ ఇవ్వు అని అడిగారు. బీర్ల విషయమై వీరి మధ్య మాట పెరిగి కొట్టుకునే స్థాయికి వచ్చింది. దీంతో పోశెట్టి, రాజు లు కలిసి జుబేర్‌ను కొట్టగా, మరుసటి రోజు గ్రామంలో పంచాయతీ పెట్టి ఇలాంటి గొడవలు మరొకసారి చేయవద్దని జుబేర్‌ను విడిచిపెట్టి సభ్యులు హెచ్చరించారు. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగగా.. నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.






