రైతు చేనులో బ్యాటరీ చోరీ..!

by Ratna Kumari |

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో కొత్త కరత్వాడా సమీపంలో ఉన్న ఓ రైతు చేనులో నుంచి సోలార్ బ్యాటరీ దొంగిలించిన ఘటన

రైతు చేనులో బ్యాటరీ చోరీ..!
X

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో కొత్త కరత్వాడా సమీపంలో ఉన్న ఓ రైతు చేనులో నుంచి సోలార్ బ్యాటరీ దొంగిలించిన ఘటన చోటు చేసుకుంది. బోథ్ మండల కేంద్రానికి చెందిన రైతు సిందేకర్ సుధాకర్ మాట్లాడుతూ.. వ్యవసాయ భూమిలో ఉన్న పంట కు అడవి పందుల బెడద నుంచి పంటను రక్షించుకోవడానికి సోలార్ పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. అయితే గురువారం వచ్చి చూసే సరికి సోలార్ పరికరం బ్యాటరీ ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తు కెళ్ళినట్లు తెలిపారు. పలువురు రైతులు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం కూడా రైతుల చేలలో ఉన్న పత్తి మూటలు దొంగలు ఎత్తుకెళ్ళిపోయారని.. ఇప్పుడు సోలార్ బ్యాటరీలు కూడా దొంగిలిస్తుండడం తో వ్యవసాయ పొలాల్లో ఉన్న పని ముట్లు కూడా ఎక్కడ ఎత్తుకెళ్తారోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Next Story