- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రాక కోసం ఎదురుచూస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ..!
రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్న ప్రతిసారీ ఏదో ఒక సమస్యలతో, ధర్నాలతో వార్తల్లో నెగ్గుతూ బాసర ట్రిపుల్ ఐటీయే ముందుంటుంది.

దిశ,భైంసా: రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్న ప్రతిసారీ ఏదో ఒక సమస్యలతో, ధర్నాలతో వార్తల్లో నిలుస్తూ బాసర ట్రిపుల్ ఐటీయే ముందుంటుంది. అయితే ప్రభుత్వాలు, అధికారులు, ప్రజా నాయకులు మారిన ట్రిపుల్ ఐటీ సమస్యలు మాత్రం మారక ప్రతిసారి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ నెల 6న పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బాసర అమ్మవారి ఆలయానికి రానున్నారు. అయితే ప్రతిసారి వార్తల్లో నిలుస్తున్న ట్రిపుల్ ఐటీ సందర్శన గావిస్తే విద్యార్థుల సమస్యలు విన్నవించుకునే అవకాశం ఉంటుందని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంఘం నాయకులు పలువురు భావిస్తున్నారు. గతంలో తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (టి. ఎస్. ఏ. ఎస్ ) నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి 16 అంశాలతో కూడినటువంటి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. అప్పుడు సానుకూలంగా స్పందించిన సీఎం ఈసారి పర్యటనలో భాగంగా ట్రిపుల్ ఐటీ సందర్శిస్తే తమ సమస్యలు సాల్వ్ అవుతాయని విద్యార్థి సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నేడు సమస్యలు వినేనా..!
బాసర ట్రిపుల్ ఐటీలో గతంలో సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు నిరసనలు, ఆందోళనలు చేయగా.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బాసర ట్రిపుల్ ఐటీ గోడలు దూకి లోనికి ప్రవేశించి మరి విద్యార్థుల సమస్యలు విన్నారు. విద్యార్థుల మరణాలు, ఆందోళనలు, మెస్ నిర్వహణ పై ఆరోపణలు, రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మరియు ఎన్ సి సి యూనిట్ లేకపోవడం, సిబ్బంది సమస్యలు ఇలా ప్రతి సమస్యను తీర్చాలని విద్యార్థుల డిమాండ్లు కొనసాగగా, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ సైతం అసెంబ్లీ సాక్షిగా విజిలెన్స్ విచారణ చేయించాలని కోరారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని పలు విద్యార్థి సంఘం నాయకులు కోరుకుంటున్నారు.
సిబ్బంది కొరత తీర్చాలి: టీఎస్ఏఎస్ బాసర ట్రిపుల్ ఐటీ అధ్యక్షులు ఆకాష్
ట్రిపుల్ ఐటీలో విద్యనభ్యసిస్తున్నటువంటి ఎనిమిది వేల పై చిలుకు విద్యార్థులకు రెగ్యులర్ వి.సి తో పాటు డైరెక్టర్, ఏవో అసిస్టెంట్ ప్రొఫెసర్,అతిథి అధ్యాపకులు చీప్ వార్డెన్,కేర్ టేకర్,సెక్యూరిటీ సిబ్బంది, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కొరత వుంది. 23 మంది ప్రొఫెసర్లు, 41 మంది అసోసియేట్ ప్రొఫెసర్, 63 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ అవసరం ఉంది.
ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయాలి: ఓయూ జాక్ అధ్యకులు సర్దార్ వినోద్ కుమార్
బాసర త్రిబుల్ ఐటీ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం విద్య ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలి. అనారోగ్యం బారిన పడిన, ఆత్మహత్యలకు ప్రయత్నించి గాయపడ్డ, అస్వస్థకు గురైన ఇక్కడి అస్పత్రి ప్రాథమిక చికిత్సలకే పరిమితమవుతుంది. ఆ విద్యార్థులను 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైంసా, 70 కిలోమీటర్లు దూరం ఉన్నా నిర్మల్, 50 కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.






