- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంద్ నీడన బల్దియా ఎలక్షన్..!
రాష్ట్రమంతా ఒకవైపు.. ఖానాపూర్ ఒకవైపు అన్నట్లుగా అక్కడి రాజకీయ పరిస్థితులు తయారయ్యాయి.

దిశ ప్రతినిధి నిర్మల్/ ఖానాపూర్: రాష్ట్రమంతా ఒకవైపు.. ఖానాపూర్ ఒకవైపు అన్నట్లుగా అక్కడి రాజకీయ పరిస్థితులు తయారయ్యాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవిలో ఎన్నికలు అనేక మలుపులు తిరుగుతూ నేటికి వాయిదా పడ్డాయి. శనివారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించగా తీవ్రస్థాయిలో గొడవలు జరిగిన నేపథ్యంలో ఎన్నికలను ఆదివారానికి వాయిదా వేశారు. ఈరోజు కూడా అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ ఒత్తిడితో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు దూరం అయ్యాయని ఆరోపిస్తూ ఆయా పార్టీల నేతలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ అపహస్యం చేసిందంటూ.. ఆదివారం ఖానాపూర్ బంద్ కు పిలుపునిచ్చాయి. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మొత్తంలో పోలీసు బలగాలను ఖానాపూర్ లో మోహరించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఒకవైపు బంద్ మరోవైపు భారీ బందోబస్తు నడుమ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితులపై భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.






