- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐటీడీఏలో బ్యాక్ లాక్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి : తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం
దిశ, ఉట్నూర్ : ఐటీడీఏ పరిధిలోని బ్యాక్ లాక్ ఉద్యోగాలను రెగ్యులర్ ప్రాతిపదికన గిరిజనులతో భర్తీ చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన

దిశ, ఉట్నూర్ : ఐటీడీఏ పరిధిలోని బ్యాక్ లాక్ ఉద్యోగాలను రెగ్యులర్ ప్రాతిపదికన గిరిజనులతో భర్తీ చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం తనుష్ డిమాండ్ చేశారు. సోమవారం ఐటీడీఏ ముందు నిరసన తెలిపి ఐటీడీఏ పీఓ ఇంచార్జ్ పీఓ యువరాజ్ మర్మట్ కి వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఆత్రం తనుష్ మాట్లాడుతూ ఐటీడీఏ లోని బ్యాక్ లాక్ ఉద్యోగాలను గత కొన్ని ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసి ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తూ వస్తున్నారన్నారు. దీని వల్ల ఏజెన్సీ ప్రాంతంలోనీ నిరుద్యోగ యువతి, యువకులు నష్టపోతున్నారన్నారు. అదే విధంగా ప్రభుత్వం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్పెషల్ డీఎస్సీని ప్రకటించాలని, ట్రైకార్ రుణాలు మంజూరు చేసి, గిరిజనులను పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు ఐటీడీఏ అధికారులు, ప్రభుత్వం ప్రోత్సహించి తగు న్యాయం చేయాలని, సుప్రీంకోర్టు కొట్టేసిన జీఓ నెంబర్ 3నీ వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు నాగోరావు, సునీల్, అర్జున్ పాల్గొన్నారు.






