- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యక్తి కాదు ఒక విప్లవం: మంత్రి వివేక్
135 వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

దిశ, మందమర్రి: డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు జిల్లాలోని మందమర్రి పట్టణంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ పట్టణ యువజన సంఘం, సింగరేణి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కార్మిక, ఉపాధి గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డీసీపీ ఏ.భాస్కర్ , జీఎం ఎన్ రాధాకృష్ణ హాజరయ్యారు. ముందుగా మార్కెట్‌లోని సింగరేణి పాఠశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి వివేక్ పంచశీల పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ పార్క్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి జై భీం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. సింగరేణిలో దళిత సామాజిక వర్గానికి చెందిన కార్మికులు చాలా మంది ఉన్నారు. అందరికీ అంబేద్కర్ అంటే ఒక స్పూర్తి. చిన్నతనంలో స్కూల్ నుండి వెలివేసిన కులవివక్ష ఉన్నపటికీ అంబేద్కర్ కృషి, పట్టుదలతో చదివి ఆ రోజులో 23 డిగ్రీలు పూర్తి చేశాడు అంటే మామూలు విషయం కాదన్నారు. నేను పెద్ద పెద్ద స్కూళ్లో చదివి డిగ్రీ సంపాదించాను కానీ అంబేద్కర్ లండన్‌లో చదివి భారతదేశపు నుండి ఎకనామిక్స్‌లో ఉత్తీర్ణత సాధించారు.
ఆయన ఆలోచన వల్లనే పార్లమెంట్‌లో..
ఆయన ఆలోచన వల్ల అన్ని వర్గాల వారికి న్యాయం చెందేలా ఎక్కడైతే అణగారిన వర్గాలకు అణచివేతకు గురవుతున్నారో వారికి హక్కులు ఉన్నాయని రాజ్యాంగంలో పొందుపరిచిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. ఆయన ఆలోచన వల్లనే పార్లమెంట్‌లో చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్లనే దేశం అభివృద్ధి చెందుతాయని రాజ్యాంగంలో రాశాడు. కాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నామని గుర్తు చేశారు. అంబేద్కర్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నపుడు నూతన చట్టాలు తీసుకుని వచ్చి పని వేళలు ఎనిమిది గంటల వరకు, బీమా సదుపాయాలు కల్పించి కార్మికులకు సేవలందించారు. మా నాన్న కాకా వెంకటస్వామి ఆయన అడుగు జాడల్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నపుడు అంబేడ్కర్ స్పూర్తితో సింగరేణి కార్మికుల కోసం 1995 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంతో మాట్లాడి ఎన్టీపిసీ నుండి 400 కోట్లు తీసుకుని, సింగరేణి కార్మికుల లక్ష ఉద్యోగాలను కాపాడాడు.
బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు..
అంబేద్కర్ స్పూర్తితోనే కార్మికులకు పెన్షన్ పథకం, ప్రాఫిట్ ఫండ్ వంటివి తీసుకొని వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంబేద్కర్ స్పూర్తితో అందరూ చదవాలని 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ స్కూల్స్ స్థాపన చేయడం మొదలుపెట్టారు. బడ్జెట్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కోసం 500 కోట్లు ప్రవేశ పెట్టారన్నారు. విద్య రంగంలో యాభై వేల మంది టీచర్లును భర్తీ చేశారంటే విద్యకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందో కదా అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు.. ఒక రెవల్యూషన్ అన్నారు. అంబేద్కర్ స్పూర్తితో మనందరం ముందుకు వెళ్ళాలి అంటూ గడ్డం వివేక్ జై భీం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సతీష్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘాలు, ఎస్సీ , ఎస్టీ, బీసీ కుల సంఘాలు పాల్గొన్నాయి. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ రమేష్, ఎస్సై లు గోపతి నరేష్, జాడి శ్రీధర్ బందోబస్తు నిర్వహించారు.






