ఉద్యాన నర్సరీలో అవకాడో మొక్కలను అభివృద్ధి చేయాలి : ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్

by Nallavelli.Anjaneyulu |

ఉద్యాన నర్సరీలలో అవకాడో మొక్కలను అభివృద్ధి చేయాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు.

ఉద్యాన నర్సరీలో అవకాడో మొక్కలను అభివృద్ధి చేయాలి :  ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్
X

దిశ, ఉట్నూర్ : ఉద్యాన నర్సరీలలో అవకాడో మొక్కలను అభివృద్ధి చేయాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఉట్నూర్ పరిధిలోని ఉద్యాన నర్సరీని సందర్శించి వివిధ మొక్కల వివరాలు, సంరక్షణ చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఉద్యాన నర్సరీలలో అవకాడో పంటపై రైతులకు అవగాహన కల్పించి, పంట సాగు చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. వేసవిలో మొక్కలకు నీటి ఎద్ద‌డి లేకుండా చర్యలు తీసుకోవాలని, 50 ఎకరాల ఉద్యాన నర్సరీని సుందరంగా ఉద్యానవనంలో తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. మొక్కల సంరక్షణలో భాగంగా నీటి వనరుల వివరాలను ఉద్యాన అధికారి సందీప్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.

Next Story