జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో అటెండర్ ఆత్మహత్యాయత్నం

by Ratna Kumari |

మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తించే బొల్లి శ్రీనివాస్ క్రిమి సంహారక మందు తాగి కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం కలకలం రేపింది.

జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో అటెండర్ ఆత్మహత్యాయత్నం
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తించే బొల్లి శ్రీనివాస్ క్రిమి సంహారక మందు తాగి కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యంలో జులై 2024లో మంచిర్యాల జిల్లా ప్ర‌ధాన కార్యాల‌యంలో జాయిన్ అయ్యాడు. 20 నెల‌లుగా అటెండ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. జిల్లా ఇన్ చార్జి డీఏవో గా ఉన్న సురేఖ అత‌డిని తిట్టిన‌ట్టు తెలుస్తోంది. త‌నపై ఎప్పుడూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేద‌ని.. 5 నెల‌ల నుంచి అత‌డినీ టార్చ‌ర్ చేస్తుంద‌ని డీఏఓ వేధింపులు త‌ట్టుకోలేక మంగ‌ళ‌వారం క్రిమి సంహార‌క మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

ఉద‌యం కార్యాల‌యానికి వ‌చ్చిన అత‌డినీ ఐదు నిమిషాలు లేటుగా వ‌చ్చినా త‌న‌ను తిట్టేద‌ని బాధితుడు పేర్కొన్నాడు. సాయంత్రం ఆఫీస్ స‌మ‌యం అయిపోయినప్పటికీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఆఫీసులో ఉండే వాడినని చెప్పుకొచ్చాడు. గతంలో చెన్నూరు డివిజన్ కార్యాలయంలో 9 సంవత్సరాలు పని చేసినట్లు తెలిపాడు. డీఏవో త‌న‌పై ఉద్దేశ పూర్వకంగానే తిట్టేదని పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

మా భ‌ర్త ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి డీఏవో సురేఖనే కార‌ణం : బొల్లి శ్రీల‌క్ష్మీ

తన భర్త ఆత్మహత్యాయత్నానికి ఇన్ చార్జి డీఏవో సురేఖ నే కార‌ణం అని బొల్లి శ్రీల‌క్ష్మీ తెలిపింది. ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. తన భర్త ఉదయం 9 గంటల వ‌ర‌కు ఆఫీస్ కి వెళ్తాడని.. రాత్రి 9 గంటల వరకు అయినా విధుల్లో ఉంటాడని తెలిపింది. జిల్లా డీఈవో సురేఖ తన భర్తను యూజ్లెస్ ఫెల్లో నీకు పని చేతకాదా అని తిట్టడం మూలంగానే తన భర్త ఆత్మహత్య య‌త్నానికి పాల్పడ్డాడంటూ కంటతడి పెట్టుకుంది. ఆఫీస్ స‌మ‌యం ముగిసిపోయిన‌ప్ప‌టికీ తన భర్త రాత్రి 9 గంటల వరకు పనిచేస్తే తనకు భార్య పిల్లలు లేరా అంటూ బోరున విలపించింది.


Next Story