పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పేకాట స్థావ‌రంపై దాడి చేసి పేకాట రాయుళ్ల‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.

పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
X

దిశ, లోకేశ్వరం : పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పేకాట స్థావ‌రంపై దాడి చేసి పేకాట రాయుళ్ల‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. మండలంలోని బాగాపూర్ శివారులో గత కొద్ది కాలంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం దాడి చేశారు. 7 గురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారని వారి నుంచి రూ.14250 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే ఇద్దరు వ్యక్తులు పారిపోయారని వారిని కూడా త్వరలో అరెస్టు చేసి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే సహించేది లేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

Next Story