ఎస్టీ బాలుర వ‌స‌తి గృహాన్ని త‌నిఖీ చేసిన ఏటీడీఓ

by Nallavelli.Anjaneyulu |

దిశ, బోథ్ : నియోజకవర్గ కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో అన్నంలో పురుగులు వస్తున్నాయని, ఫిర్యాదులు జిల్లా అధికారులకు వెళ్లడం తో బుధవారం ఏటీడీఓ సుచరతన్ రెడ్డి విచారణ చేపట్టారు.

ఎస్టీ బాలుర వ‌స‌తి గృహాన్ని త‌నిఖీ చేసిన ఏటీడీఓ
X

దిశ, బోథ్ : నియోజకవర్గ కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో అన్నంలో పురుగులు వస్తున్నాయని, ఫిర్యాదులు జిల్లా అధికారులకు వెళ్లడం తో బుధవారం ఏటీడీఓ సుచరతన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని అన్నారు. ఈ సందర్బంగా హాస్టల్ లోని స్టోర్ రూమ్ తో పాటు కిచెన్ గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా భోజనంలో పురుగులు ఎందుకు వచ్చాయంటూ సిబ్బందిని అడిగారు. ఏటీడీఓ మాట్లాడుతూ విద్యార్థులందరినీ విచారించడం జరుగుతుందని విద్యార్థులు చెప్పిన విషయాలను పై అధికారులకు తెలియజేస్తామన్నారు.ఆయ‌న వెంట హాస్టల్ వార్డెన్ నాందేవ్ ఉన్నారు.

Next Story