బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు : అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి.రాజలింగు

by Ratna Kumari |

దిశ‌, ఆదిలాబాద్ : బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి.రాజలింగు అన్నారు. దీపావళి పండుగ

బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు : అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి.రాజలింగు
X

దిశ‌, ఆదిలాబాద్ : బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి.రాజలింగు అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల వద్ద ఆదివారం షూర్ ఎన్జీవో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సందర్భంగా లేబర్ ఆఫీసర్ మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవద్దని సూచించారు.క్రాకర్స్ షాప్స్ ప్రమాదకరమైనవని పనుల్లో పెట్టుకున్న సంబంధిత షాప్ యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు.అనుకొని సంఘటన జరిగితే బాలలకు ఇబ్బందులు వస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్,వన్ టౌన్ ఎస్ఐ సయ్యద్ ఇసాక్,క్రాకర్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేందర్,షూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ కె.వినోద్,ఫీల్డ్ సూపర్వైజర్లు కిరణ్,సౌజన్య , చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ అనిల్,కేస్ వర్కర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Next Story