- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ వడ్డీ వ్యాపారస్తుల ఇండ్లలో పోలీసుల సోదాలు.. పలు డాక్యుమెంట్లు సీజ్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో వడ్డీ వ్యాపారస్తులపై పోలీసులు కొరడా ఝలిపించారు.

దిశ, మంచిర్యాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో వడ్డీ వ్యాపారస్తులపై పోలీసులు కొరడా ఝలిపించారు.జిల్లా ఎస్పి డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సోమవారం సబ్ డివిజన్ పోలీసులు ఆసిఫాబాద్ పట్టణంలో అధిక వడ్డీ వసూలు చేస్తూ వ్యాపారం చేస్తున్న పలువురి ఇండలో ఈరోజు ఉదయం 5 గంటల నుండి సోదాలు నిర్వహించారు. సోదాల్లో పదిమందిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వడ్డీ వ్యాపారుల నుండి 11 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు ఎ.ఎస్పీ వివరాలు వెల్లడించారు. వీరి నుండి బ్లాక్ చెక్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, బాండ్ పేపర్స్, ప్రామిసరీ నోట్స్, ఏటీఎం కార్డ్స్ ,సీజ్ చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారం లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిర్వహించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సోదాల్లో సబ్ డివిజన్లోని 4 గురు ఎస్సైలు, ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది, 50 మంది పోలీసులు పాల్గొన్నారు.






