- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > సూపర్ వైజర్ ను సస్పెండ్ చేయండి.. ఎమ్మార్వోకు ఆశావర్కర్స్ ఫిర్యాదు

X
దిశ, తాండూర్ : బెల్లంపల్లిలో ఆశా కార్యకర్తను వేధింపులకు గురిచేస్తున్న సూపర్ వైజర్ ను సస్పెండ్చ చేయాలంటూ ఆశా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తాండూరు మండల ఆశా వర్కర్స్ యూనియన్, సిఐటియు నాయకులు స్థానిక తహసిల్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ షంషీర్ నగర్ పీహెచ్సీలో పనిచేస్తున్న సూపుర్ వైజర్ అకారణంగా ఆశా కార్యకర్తను అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ చేసి అతని విధుల నుంచి సస్పెండ్ చేయాని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరుకామని మండల నాయబ్ తహసిల్దార్ ప్రసాద్ కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు శంకర్, నాన్నయ్య, రాజేశ్వరి, కవిత, నర్సుబాయి, లక్ష్మి, సునీత, సుమలత తదితరులు పాల్గొన్నారు.
Next Story






