అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

by Ratna Kumari |

దిశ, బోథ్ : నాగపూర్ నుంచి పశువులను అక్రమంగా కంటైనర్ లారీ లో హైదరాబాద్ కు గురువారం తరలిస్తుండగా పోలీసులు ప‌ట్టుకున్నారు. బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపిన

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
X

దిశ, బోథ్ : నాగపూర్ నుంచి పశువులను అక్రమంగా కంటైనర్ లారీ లో హైదరాబాద్ కు గురువారం తరలిస్తుండగా పోలీసులు ప‌ట్టుకున్నారు. బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు సోనాల మండలం లోని ఘన్పూర్ చెక్ పోస్ట్ వద్ద గురువారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతం లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే నాగ్ పూర్ నుంచి అక్రమంగా దాదాపు 27 పశువులను హైదరాబాద్ కు తరలిస్తుండగా లారీ ని పట్టుకున్నామని అన్నారు. లారీలో రెండు పశువులు మృతి చెందాయని, కొన్ని పశువులు చావు బతుకుల మధ్య ఉండడంతో వెటర్నరీ అసిస్టెంట్ రాథోడ్ రాజేందర్ ద్వారా వైద్యం అందించామని తెలిపారు. పశువులను బజార్ హత్నూర్ గోశాల కు తరలించామన్నారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న వారి పై కేసు నమోదు చేసి డ్రైవర్ జునైద్, శైజాజ్ కురేషి లను అరెస్ట్ చేశామన్నారు.

ఆగని పశువుల మూగ రోధన

అక్రమంగా పశువులను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు కంటైనర్ లారీలలో 20 నుంచి 30పశువులను ఎక్కించి ఊపిరాడకుండా రవాణా చేస్తుండడం తో అందులో కొన్ని పశువులు మృత్యువాత పడుతున్నాయి. అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా పశువుల అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

Next Story