ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌కు ఏర్పాట్లు పూర్తి

by Ratna Kumari |

ఇంటర్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ హరిత తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో పరీక్షల ఏర్పాట్ల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌కు ఏర్పాట్లు పూర్తి
X

దిశ, ఆసిఫాబాద్ : ఇంటర్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ హరిత తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో పరీక్షల ఏర్పాట్ల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాలు, పదో తరగతి పరిక్షల కోసం 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప‌రీక్ష‌ల‌ను పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, పారిశుద్యం, ఫర్నిచర్, ఫ్యాన్లు విద్యుత్ తో పాటు మెడికల్ సౌకర్యం ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్ధులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల‌ని సూచించారు. పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్ల మూసివేతకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పరిక్ష కేంద్రాలలో మొబైల్ ఫోన్లు ఎల్లక్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నంలోని ముఖ్య ప్ర‌ణాళిక కార్యాల‌యాన్ని క‌లెక్ట‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. పని చేసే ఉద్యోగులు సమయ పాలన పాటించారని ముఖ్య ప్రణాళిక అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు.

Next Story