అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు

by velandi.Saikiran |

అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. గత నాలుగు రోజుల క్రితం న్యూఢిల్లీలోని దేశ వైమానిక దళంలో పనిచేస్తున్న

అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు
X

దిశ, ముధోల్: అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. గత నాలుగు రోజుల క్రితం న్యూఢిల్లీలోని దేశ వైమానిక దళంలో పనిచేస్తున్న ముధోల్ మండలం తెల్గ తరోడ వాసి లక్ష్మి ఈశ్వర్ ప్రసాద్ (25) వాటర్ ఫాల్లో పడి చనిపోగా, శనివారం అతని అంత్యక్రియలు స్వ గ్రామంలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఎయిర్ ఫోర్స్ అధికారి ప్రవీణ్ సింగ్ చౌహన్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. ఇక చివరి చూపు కొరకు మృతుని కుటుంబ సభ్యులు ,బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, సిఐ మల్లేష్, ఎస్ఐ బిట్ల పెర్సిస్, తదితరులు పాల్గొన్నారు.

Next Story