గ్రూప్1 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు..కలెక్టర్ ముషారఫ్ అలీ

by Disha Web Desk 20 |
గ్రూప్1 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు..కలెక్టర్ ముషారఫ్ అలీ
X

దిశ, నిర్మల్ కల్చరల్ : ఈ నెల 16వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలిసి జిల్లాకేంద్రంలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. స్థానిక రవి హైస్కూల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సీసీ కెమెరాలను, ఫర్నిచర్ ను పరిశీలించి, పకడ్బందీ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ఈ పరీక్షలకు 4,620 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరివెంట రెవెన్యూ డివిజనల్ అధికారి తుకారామ్, తహసీల్దార్ సుభాష్ చందర్, జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed