శుభవార్త.. డబుల్ బెడ్ రూం ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకోండి

by Gopi |
శుభవార్త.. డబుల్ బెడ్ రూం ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకోండి
X

దిశ, భైంసా: భైంసా పట్టణంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లకు అర్హులైన ఇళ్లు లేని పేదలు దరఖాస్తులు చేసుకోవాలని భైంసా ఆర్డీవో రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని 26 వార్డుల్లో వార్డుల వారీగా దరఖాస్తులను స్వీకరించేందుకు సిబ్బందిని నియమించామన్నారు. సంబంధిత వార్డుల్లో ఈ నెల 5 నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు ఉదయం 10.30 నుండి 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత పత్రాలను సిబ్బందికి అందించి సహకరించాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed