- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ గా బండారి అనూష
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మెన్ గా స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష ఎన్నికయ్యారు.

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మెన్ గా స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో 27 మంది కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో ఆమె ఎన్నికయ్యారు. మొత్తం 51 మంది సభ్యుల్లో కాంగ్రెస్ 11, ఎంఐఎం 6, బీఆర్ఎస్ 5, స్వతంత్రులు 5, మద్దతుతో ఆమె విజయం సాధించారు. 45వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనూష.. తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. టికెట్ రాక భంగపాటుకు గురైన ఆమె.. స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి, అన్ని పార్టీల మద్దతుతో చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఆమెకు పోటీగా బీజేపీ తరపున చైర్ పర్సన్ గా బరిలోకి దిగిన జోగు శైలజకు 23 ఓట్లు వచ్చాయి. వైస్ ఛైర్మన్ 44వ వార్డు ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. అయితే 21 వార్డులు గెలిచిన బీజేపీ మున్సిపల్ పీఠం దక్కించుకోకపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్టే అని పెద్ద చర్చ సాగుతోంది.






