కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో మరో ప్రమాదం

by Ratna Kumari |

దిశ, కాగజ్ నగర్ : కార్మికుల భద్రత గాలిలో దీపంలా మారుతోంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శ

కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో మరో ప్రమాదం
X

దిశ, కాగజ్ నగర్ : కార్మికుల భద్రత గాలిలో దీపంలా మారుతోంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శనివారం ఉద‌యం 12 గంట‌ల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో పర్మినెంట్ కార్మికుడు చిలుక శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. రికవరీ బైలర్‌లోని ఈవా ప్రేటర్‌లో బ్లాక్ లిక్కర్ పడి ఉండడంతో, దానిని శుభ్రపరిచే క్రమంలో ప్రమాదవశాత్తు కార్మికుడు చిలుక శ్రీనివాస్ కింద పడ్డారు. వెంటనే గమనించిన తోటి కార్మికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎక్స్‌-రే తీయగా, ఆయన ఎడమ చేతి విభాగం ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం కార్మికుడిని వెంటనే అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని సనత్ నగర్‌కు తరలించారు.

యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు

ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న దిశ విలేఖరి ఫోటోలు తీసి వార్తను కవర్ చేసే ప్రయత్నం చేయగా, మిల్లు యాజమాన్యం అత్యంత దురుసుగా ప్రవర్తించింది. ఫోటోలు తీయరాదని, వార్త కవర్‌ చేయరాదని యాజమాన్యం తరపు వ్యక్తులు విలేఖరిని బెదిరించడం ఇది యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపిస్తుంది. మిల్లులో తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు తగిన రక్షణ పరికరాలు, సురక్షితమైన పని వాతావరణం కల్పించడంలో యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయం బయటికి పొక్కకుండా, జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చేందుకే యాజమాన్యం ప్రయత్నిస్తోందని కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. విలేఖరిని బెదిరించడం ఈ నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు అంటున్నారు. సిర్పూర్ పేపర్ మిల్లులో పనిచేస్తున్న వందలాది మంది కార్మికుల జీవితాలకు రక్షణ కల్పించాలని, తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం, కార్మిక శాఖ సమగ్ర విచారణ చేసి వెంటనే ప్రభుత్వం కార్మిక శాఖ జోక్యం చేసుకోవాలని, మిల్లులో భద్రతా ప్రమాణాలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు.

Next Story