పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ ఎస్పీ అఖిల్ మహాజన్

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఇచ్చోడ : వార్షిక తనిఖీ లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ను బుధవారం పరిసరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ క్షుణంగా పరిశీలించారు. పోలీసుల

పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ ఎస్పీ అఖిల్ మహాజన్
X

దిశ, ఇచ్చోడ : వార్షిక తనిఖీ లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ను బుధవారం పరిసరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ క్షుణంగా పరిశీలించారు. పోలీసులతో పరేడ్ నిర్వహించి వారి విధులు, త‌దిత‌ర అంశాలు అడిగి తెలుసుకున్నారు. విధులను క్రమశిక్షణ తో నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై నేరాల నివారణకు కృషి చేయాల‌న్నారు. గ్రామీణ పోలీస్ వ్యవస్థ ను పటిష్టం చేస్తూ గ్రామీణ ప్ర‌జ‌ల‌కు పోలీసు చట్టాలపై అవగాహనా కల్పించాలని సూచించారు. పోలీసు స్టేషన్ లోని రికార్డ్ లు క్షుణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఉట్నూర్ అడిషనల్ ఎస్పీ కాజల్ సింగ్ ఐ పి ఎస్,సీఐ బి రాజు, ఎస్సై పురుషోత్తం పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Next Story