- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భానుడి భగభగతో ఇబ్బంది పడుతున్న మూగజీవులు
రాష్ట్రంలో భానుడి తీవ్రత రోజురోజుకు పెరగడంతో జనాలు, ఇటు మూగజీవులు ఎండ తీవ్రతను తట్టుకోలేక పోతుంది.

దిశ, ఖానాపూర్ : రాష్ట్రంలో భానుడి తీవ్రత రోజురోజుకు పెరగడంతో జనాలు, ఇటు మూగజీవులు ఎండ తీవ్రతను తట్టుకోలేక పోతుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఎండ త్రీవత ఉండడంతో రెండు గంటలకు బయటకు ఎవరు రాని పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రతగా ఉండంతో కొందరు రైతులు పశువులను మేతకు అడవికి పంపడం లేకుండా ఇంట్టి వద్దనే ఉంచుకుంటున్నారు. కానీ ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలానికి చెందిన భీమేష్ అనే రైతు మూగజీవుల మీద ఉన్న ప్రేమతో తన గేదలను బయటకు పంపకుండా పశువుల పాకలో ఉంచి ప్రతిరోజు గేదెల పైన తట్టుబొంతలు కప్పి వాటి మీద చల్లగా ఉండడం కొరకు నీళ్లను పోస్తూవున్నారు. అంతే కాకుండా ఫ్యాన్ పెట్టి పశువులకు గంటకొక్కసారి నీళ్లు చల్లితే పశువులు ఎండకు చల్లగా వుండి పాలు అధికంగా ఇస్తుందని ఆ రైతు అంటున్నారు. ఏదేమైనా మూగజీవుల పై చూపిస్తున్న ప్రేమను ఆ రైతు చేస్తున్న ఐడియా బాగుంది అని పలువురు కొనియాడుతున్నారు.






