రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..!

by Ratna Kumari |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చైన్ స్నాచ‌ర్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. గ‌త నెల రోజుల కింద‌ట వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డి జిల్లా ప్ర‌జ‌ల‌ను హ‌డలెత్తించారు.

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..!
X

దిశ‌, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చైన్ స్నాచ‌ర్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. గ‌త నెల రోజుల కింద‌ట వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డి జిల్లా ప్ర‌జ‌ల‌ను హ‌డలెత్తించారు. తాజాగా మ‌ళ్లీ కేటుగాళ్లు అమాయ‌కుల వ‌ద్ద‌ దోచుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఆసిఫాబాద్ ప‌ట్ట‌ణంలో గుండి రోడ్డు పై సోమ‌వారం ఉద‌యం త‌న ఇంటి ముందు అంజ‌లి అనే వృద్ధురాలు ముగ్గు వేస్తోంది. ఇదే క్ర‌మంలో ఇద్ద‌రు చైన్ స్నాచ‌ర్లు బైకు పై వ‌చ్చారు. త‌మ బైకులో పెట్రోల్ అయిపోయింద‌ని.. ఇక్క‌డ పార్కింగ్ చేస్తామ‌ని మాయ‌మాట‌లు చెప్పారు. మాట‌లు వింటున్న‌టువంటి వృద్ధురాలు మెడ‌లో ఉన్న‌న‌టువంటి 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. అయితే చైన్ స్నాచ‌ర్లు ఇద్ద‌రూ హెల్మెట్స్ పెట్టుకోవ‌డం వ‌ల్ల వారి ఆచూకి గుర్తించ‌డం పోలీసుల‌కు క‌ష్ట‌త‌రంగా మారింది.

Next Story