గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ.. యువ‌కుడు మృతి

by Ratna Kumari |

దిశ‌, మామ‌డ : గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని యువ‌కుడు మృతి చెందిన ఘ‌ట‌న మామ‌డ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని

గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ.. యువ‌కుడు మృతి
X

దిశ‌, మామ‌డ : గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని యువ‌కుడు మృతి చెందిన ఘ‌ట‌న మామ‌డ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని బూరుగుప‌ల్లి గ్రామ స‌మీపంలోని ర‌హ‌దారి పై మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్ర‌మాదంలో బీహార్ కి చెందిన లోకేశ్వ‌ర్ నాయ‌క్ (25) మృతి చెందాడు. లోకేశ్వ‌ర్ ఆదిలాబాద్ నుంచి హైద‌రాబాద్ వైపున‌కు వెళ్తుండ‌గా గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొన‌డంతో త‌లకు, కాలుకు బ‌ల‌మైన గాయం కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. ఈమేరకు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు పేర్కొన్నారు.

Next Story