- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'సుస్మిర్' గ్రామస్తులంతా గిరిజనులే.. రిజర్వేషన్ మాత్రం బీసీ మహిళా..!
దిశ, బెజ్జూర్ : బెజ్జూరు మండలం సుష్మీర్ గ్రామంలో అంతా గిరిజనులే ఉన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో సర్పంచ్ మాత్రం

దిశ, బెజ్జూర్ : బెజ్జూరు మండలం సుష్మీర్ గ్రామంలో అంతా గిరిజనులే ఉన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో సర్పంచ్ మాత్రం బీసీ మహిళకు కేటాయించారు. సర్పంచ్ తో పాటు ఆరు వార్డు సభ్యులకు అలాగే కేటాయించారు. బెజ్జూరు మండలంలో సుష్మీర్ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం,..311 మంది జనాభా ఉన్నారు. అందులో 303 మంది గిరిజనులు ఉండగా.. పదిమంది దళితులు ఉన్నారు. సుస్మిర్ గ్రామంలో 203 గిరిజన ఓటర్లు ఉన్నారు. మిగతా పదిమంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సర్పంచ్ రిజర్వేషన్లను ప్రకటించింది. ఈ గ్రామంలో అసలు బీసీలే లేకున్నా బీసీ రిజర్వేషన్ ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో బీసీల లేనప్పటికీ బీసీ రిజర్వేషన్ ప్రకటించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు మార్పు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే బెజ్జూర్ మండలం తుమ్మల గూడెం లో బీసీ మహిళకు అదృష్టం వరించింది. కేవలం ఒక్క ఇల్లు మాత్రమే ఉన్న బీసీ మహిళ కు సర్పంచ్ పదవీ దక్కనుంది. తుమ్మలగూడ గ్రామంలో 650 జనాభా ఉంది. అందులో 325 మంది ఓటర్లు ఉన్నారు. ఎక్కువ శాతం ఓటర్లు దళితులే ఉన్నారు. అయినప్పటికీ సర్పంచ్ రిజర్వేషన్ మాత్రం బీసీకి కేటాయించడం గమనార్హం.






