దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు : ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆదిలాబాద్ : అనాదిగా వస్తున్న దసరా ఉత్సవాలను ఈ ఏడాది సైతం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని ఎమ్మెల్యే

దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు :  ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్
X

దిశ, ఆదిలాబాద్ : అనాదిగా వస్తున్న దసరా ఉత్సవాలను ఈ ఏడాది సైతం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హిందూ నమాజ్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని దసరా మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు మఠాధిపతి యోగానంద్ సరస్వతితో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. చెడు పై విజయం సాధించినందుకు జరుపుకునే గొప్ప పండుగ దసరా అని అన్నారు. ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమాన్లు, రాళ్ల బండి మహేందర్, జ్యోతి రెడ్డి, సచిన్, భరత్ పాల్గొన్నారు.

Next Story