- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు : ఏఐటీయూసీ
మండల కేంద్రంలోని అంగన్ వాడీ కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమావేశాన్ని ఏఐటీయుసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

దిశ, బజార్ హత్నూర్ : మండల కేంద్రంలోని అంగన్ వాడీ కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమావేశాన్ని ఏఐటీయుసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో ఏఐటీయుసీ రాష్ట్ర నాయకుడు కుంటల రాములు పాల్గొని మాట్లాడారు. నెలల తరబడి కార్మికుల వేతనాలు, బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న కార్మికులను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పెండింగ్ వేతనాలు, బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకు సామాజిక భద్రత పథకాలు వర్తింపజేయాలని కోరారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఏఐటీయుసి ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కీర్తి, రమణ, అనిత, లక్ష్మి, బి.లక్ష్మి, రాజారాం, లక్ష్మిలను మండల కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.






