ఎయిర్టెల్ టవర్ నిర్మాణం వెంటనే నిలిపివేయాలి..

by Kodari Anjali |

ఎయిర్టెల్ టవర్‌‌ను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం రోజున జిల్లా కలెక్టర్‌‌కు వినతిపత్రం సమర్పించారు.

ఎయిర్టెల్ టవర్ నిర్మాణం వెంటనే నిలిపివేయాలి..
X

దిశ, మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో నిర్మాణం జరుగుతున్న ఎయిర్టెల్ టవర్‌ ను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం రోజున జిల్లా కలెక్టర్‌ కుమార్ దీపక్‌కు వినతిపత్రం సమర్పించారు. టవర్ నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావం వల్ల పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, అలాగే గ్రౌండ్‌లో నిత్యం వ్యాయామం చేసే వాకర్స్, ప్లేయర్స్‌కు కూడా ఇబ్బందులు కలుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎయిర్టెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకొని, నిర్మాణాన్ని నిలిపివేయాలని వాకర్స్ అసోసియేషన్ నాయకులు దుర్గం ప్రభాకర్, చీమలపాటి రాజేశం తదితరులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Next Story